ఉండవెల్లి, జూన్ 16 : కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో ఓ తండ్రి అల్లుడిని హతమార్చాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి మద్దిలేటి, రాములమ్మ దంపతుల కూతురు మహేశ్వరిని ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన దేవేందర్(36)తో ఆరేండ్ల కిందట పెండ్లి చేశా రు. వీరికి ఇద్దరు సంతానం. దేవేందర్ మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు.
ఈ క్రమంలో మద్దిలేటి తన కూతురిని పదిరోజుల కిందట ఉండవెల్లికి తీసుకొచ్చాడు. కాగా, దేవేందర్ శనివారం మద్యం తాగి రాత్రి 10:30 గంటలకు ఉండవెల్లికి కొచ్చి మరోసారి గొడవపడి నిద్రపోయాడు. అర్ధరాత్రి కాగానే మద్దిలేటి తన ఇంటి ముం దున్న బండరాళ్లు, సిమెంట్ ఇటుక తీసుకొచ్చి దేవేందర్ తలపై మోది హత్య చేశాడు. మరో గదిలో ఇద్దరు పిల్లలతో పడుకున్న మహేశ్వరి తెల్లవారుజామున లేచి చూడగా తన భర్త రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చిం ది. నిందితుడు మద్దిలేటి పరారీలో ఉన్నాడు. మృతుడి తల్లి జయమ్మ పోలీ సులు కేసు నమోదు చేసుకొన్నారు.