Electric shock | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో కౌలు రైతు మృతి
Electric shock | విద్యుదాఘాతంతో( Electric shock) ఓ రైతు మృతి(Farmer died) చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది.
జోగుళాంబ గద్వాల : విద్యుదాఘాతంతో( Electric shock) ఓ రైతు మృతి(Farmer died) చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఉండవెల్లి మండలం మారమునగాల-2కు చెందిన ఒనూరు బాషా (45)కు భార్య షాలీబీతోపాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబంతో కలిసి గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న ఆరెకరాలతోపాటు అదనంగా పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నాడు.
ఈ ఏడాది వర్షాలు పలుకరించగా.. వేణుగోపాల్‌రెడ్డికి చెందిన 10 ఎకరాల భూమిని రూ.లక్షా 50 వేలకు కౌలుకు తీసుకున్నాడు. గురువారం కౌలు పొలం దున్నేందుకు బాషా తన కొడుకు షేక్షావలీ, ట్రాక్టర్ డ్రైవర్ రాజుతో కలిసి వెళ్లాడు. దుక్కి దున్నే క్రమంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ట్రాక్టర్‌కు తగిలే అవకాశం ఉండంతో కట్టె సాయంతో వైర్లను పైకిలేపాడు.
అదే సమయంలో త్రీఫేస్లోని ఒక తీగ తెగి బాషా చేతిపై పడడంతో షాక్‌కు గురయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఏపీలోని కర్నూల్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాషా మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

