చెన్నూర్, నవంబర్ 9: చెన్నూర్‌లో నామినేషన్ల సందర్భంగా గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయ సమీపంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నామినేషన్ వేసేందుకు ఒకే సమయానికి వచ్చారు.
ఈ సమయంలో వివేక్ వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చ గొట్టేలా నినాదాలు చేశారు. సహనం పాటించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు వచ్చి ఇరు పార్టీల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.