ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని చేర్చుకోవద్దు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్‌పర్సన్ సరిత వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
- కాంగ్రెస్‌లో నిరసనల హోరు
- వ్యతిరేకిస్తున్న జడ్పీచైర్‌పర్సన్ వర్గం
- టవరెక్కి కాంగ్రెస్ కార్యకర్త హల్చల్
- పెట్రోల్ పోసుకున్న మరో ముగ్గురు
- అడ్డుకున్న పోలీసులు, నాయకులు
గద్వాల అర్బన్/ధరూరు/కేటీదొడ్డి, జూలై 4 : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్‌పర్సన్ సరిత వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గురువారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం అయింది.
ఎమ్మెల్యే ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్త ప్రసాద్ సెల్ టవర్‌పైకి ఎక్కి నిరసన తెలిపాడు. ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే టవర్ పైనుంచి దూకేస్తానని హెచ్చరించాడు. ఏఎస్సీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని అతడికి నచ్చజెప్పారు. కొద్దిసేపటి తర్వాత కిందికిరాగా దవాఖానకు తరలించారు. అనంతపురానికి చెంది న రహీం, గద్వాలకు చెందిన అనిల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించా రు.
పోలీసులు, అక్కడున్న నాయకులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ధరూర్లోనూ డీఆర్ శ్రీధర్ ఆధ్వర్యంలో మాజీ పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, సూరితోపాటు పలువురు కార్యకర్తలు నిరసన చేపట్టారు. మండల ప్రజాపరిషత్ కార్యాల యం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. కేటీదొడ్డిలోనూ నాయకులు ఆనంద్‌గౌడ్, శ్రీను, విష్ణు, గోవర్దన్, వేషాద్రి, మునెప్ప నాయక్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

గద్వాల-రాయిచూర్ రహదారిపై హస్తం పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. సరితమ్మ నాయకత్వంలో కాంగ్రెస్‌కు గద్వాలలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. ఆయన్ను చేర్చుకుంటే అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని వాపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

