హైదరాబాద్, ఎడ్యుకేషన్ డెస్క్ జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 8,594 ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సూచించింది.
ఈ పోస్టులకు డిగ్రీ, ఎంబీఏ, లా, సీఏ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నది. వివరాలకు https://www.ibps.in/crp-rrb-xii వెబ్సైట్ను సంప్రదించాలని కోరింది.