Minister Harish Rao | జూలైలో 72 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే.. వైద్యారోగ్య సిబ్బందిని అభినందించిన మంత్రి హరీశ్
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాల సంఖ్య, ఇప్పుడు 72శాతానికి పెరిగిందన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సర్కారు దవాఖానల్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు, నిపుణులైన వైద్య సిబ్బందిని కూడా నియమిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో (Govt hospitals) ప్రసవాల సంఖ్య (Deliveries) గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతంగా ఉన్న ప్రసవాల సంఖ్య, ఇప్పుడు 72శాతానికి పెరిగిందన్నారు. సర్కారు దవాఖానలపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
2014లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతమే ఉండేవి. అంటే ప్రతి వంద మంది గర్భిణుల్లో 30 మంది ప్రభుత్వ దవాఖానకు వస్తే.. 70 మంది ప్రైవేట్‌కు వెళ్లేవారు. అయితే సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని చెప్పారు. ఏప్రిల్ నెలలో 69 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 72 శాతానికి పెరగడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

