వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు స్థలం కేటాయింపు
Hyderabad Public School | వరంగల్ జిల్లాలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్‌లో గత ఐదేండ్లుగా అద్దె భవనంలో నడుస్తన్నది. ప్రభుత్వానికి అభ్యర్థన పంపిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ జీవో నెంబర్ 93ని జారీ చేసింది.
ఈ జీవోని ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా, రాజ్యసభ సభ్యుల సురేశ్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్, ఉపాధ్యక్షుడు గుస్తీ జె. నోరియాకు అందజేశారు. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్‌కు రావడానికి సహకరించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతులకు ఆ స్కూల్ సొసైటీ ఉపాధ్యక్షుడు నోరియా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

