తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులు
TS Govt | తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్
హైదరాబాద్ : తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 472 పోస్టులను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్(సివిల్) పోస్టులు, 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(సివిల్) పోస్టులు, 61 జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులతో పాటు మరి కొన్ని పోస్టులను కొత్తగా సృష్టించారు.
అయితే.. గతంలో మంజూరు చేసిన 62 ఉద్యోగాలను రద్దు చేశారు. గతంలోని.. సీనియర్ స్టెనో(లోకల్ కేడర్), టైపిస్ట్(హెచ్వో), టైపిస్ట్(లోకల్ కేడర్), టెక్నీషియన్(హెచ్వో), ప్రింటింగ్ టెక్నీషియన్(లోకల్ కేడర్), వాచ్మన్(లోకల్ కేడర్), స్వీపర్(లోకల్ కేడర్) పోస్టులను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
గతేడాది డిసెంబర్ 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

