9 లేదా 10న నైరుతి రాక
నైరుతి రుతుపవనాలు ఈ నెల 9 లేదా 10న తెలంగాణలో ప్రవేశించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గత ఏడాది జూన్ 6న రాష్ట్రంలోకి వచ్చిన రుతుపవనాలు 9 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రుతుపవనాల రాక 3-4 రోజులు ఆలస్యమైనప్పటికీ ఇది సాధారణ సమయమేనని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి చెప్పారు.
- రాష్ట్రంలో తగ్గని ఎండ
- ముత్తారంలో 45.8 డిగ్రీలు
- 11 వరకు తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 9 లేదా 10న తెలంగాణలో ప్రవేశించవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గత ఏడాది జూన్ 6న రాష్ట్రంలోకి వచ్చిన రుతుపవనాలు 9 నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈసారి రుతుపవనాల రాక 3-4 రోజులు ఆలస్యమైనప్పటికీ ఇది సాధారణ సమయమేనని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి చెప్పారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా మంగళవారం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 45.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ నెల 9 వరకు సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఆ తర్వాత 11 వరకు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ లోగా రైతులు దుక్కులు సిద్ధం చేసుకోవాలని, రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాకే విత్తనాలు వేసుకోవాలని శ్రావణి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

