18న ఆఫీసుల ముట్టడికి బీసీలు సిద్ధం
కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.
- మళ్లీ కులగణన చేపట్టాలి
- 42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే..
- ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు
- పార్టీపరంగా ఇస్తామంటే మేం బిచ్చగాళ్లమా?
- ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య
రవీంద్రభారతి, ఫిబ్రవరి12: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్రవ్యాప్తం గా అన్ని ప్రభు త్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి, ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన బీసీ నేతల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టపరంగా కల్పించాలి తప్ప, పార్టీపరంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పార్టీ పరంగా ఇచ్చేందుకు మేమేమైనా బిచ్చగాళ్లమా? అని నిలదీశారు. ‘రాజ్యాంగం ప్రకారం మా వాటా మాకిచ్చి తీరాల్సిదే.. లేకుంటే రాష్ర్టాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. బీసీ భవన్లో 14 బీసీ సంఘాలు 30 కులసంఘాలతో కలిసి రిజర్వేషన్లపై చర్చించామని తెలిపారు. గత సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూ పి రిజర్వేషన్లకు మొండిచేయి చూపుతామంటే సహించబోమని స్పష్టంచేశారు. వెంటనే సీఎం అఖిలపక్షం స మావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని పార్టీల నిర్ణయాలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు అన్యా యం తలపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అంతుచూస్తామని తీవ్ర స్థాయిలో హె చ్చరించారు. బీసీ నేతలు వేముల రా మకృష్ణ, గొరిగే మల్లేశ్, నందగోపాల్, బీసీ మహిళా నేత కీర్తిలతాగౌడ్, మోదీ రామ్‌దేవ్, శివ, రవియాదవ్, జయంతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

