Mohammad Azharuddin | హెచ్‌సీఏలో భారీ అవినీతి.. అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదు
Mohammad Azharuddin | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై నాలుగు కేసులు నమోదయ్యాయి.
Mohammad Azharuddin | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin)పై నాలుగు కేసులు నమోదయ్యాయి. హెచ్‌సీఏ (HCA)లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు (Rachakonda Police) అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదు చేశారు. మరోవైపు తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోసం మల్కాజ్గిరి కోర్టును ఆయన ఆశ్రయించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని అజారుద్దీన్‌పై ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేశారని.. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదు అయింది. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో రాచకొండ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అజారుద్దీన్ సిద్ధమైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు.
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో.. కేంద్ర ఐటీ విభాగం ఏమందంటే..?
Rahul Gandhi | కేదార్నాథ్ ఆలయంలో రాహుల్.. భక్తులకు టీ అందించిన కాంగ్రెస్ నేత
Israel – Hamas War | గాజాను రెండుగా విభజించి భీకర దాడులు.. ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

