శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 36 విమాన సర్వీసులు రద్దు
కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాప్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది.
- మాన్యువల్‌గా రాసి బోర్డింగ్ పాసులు జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాప్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం తలెత్తింది. దేశ విదేశాలకు వెళ్లాల్సిన 36 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
విమానాల రాకపోకలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కంప్యూటర్ల మీదే జరుగుతాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికుల వివరాలను తనిఖీ, బోర్డింగ్ పాస్‌ల జారీని ఇవ్వలేకపోయారు. కొన్ని విమానాల రాకపోకలను కొనసాగించేందుకు బోర్డింగ్ పాస్‌లను మాన్యువల్‌గా రాసి ఇచ్చి విమానాల ప్రయాణాలు సాగేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీస్ సిగ్నళ్లకూ అంతరాయం ఏర్పడింది. అయితే విమాన సర్వీసుల రద్దు వల్ల కొందరు ప్రయాణికులు 7-8 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

