హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): వివిధ జిల్లా కోర్టుల్లో టైపిస్ట్ (144), కాపీయిస్ట్ (84), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (91) పోస్టుల భర్తీకి హైకోర్టు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. మొత్తం 319 పోస్టుల భర్తీకి జూన్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నది. పరీక్షల తేదీలను జూలైలో ప్రకటించనున్నది. వివరాలకు https://tshc. gov.inను సంప్రదించవచ్చు.