TGSRTC | ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు ఔట్సోర్సింగ్.. తాత్కాలికంగా డ్రైవర్ల నియామకం
TGSRTC | ఆర్టీసీలో ప్రభుత్వం భర్తీచేస్తామన్న 3,038 ఉద్యోగాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేసేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నాయి.
TGSRTC | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో ప్రభుత్వం భర్తీచేస్తామన్న 3,038 ఉద్యోగాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీచేసేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా గత మే నెలలో హైదరాబాద్‌తోపాటు పలు రీజియన్లలో తాత్కాలికంగా డ్రైవర్, కండక్టర్లను నియమించుకున్న ఆర్టీసీ.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకుంటున్నది.
హైదరాబాద్, సికింద్రాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ రీజియన్లలో దశలవారీగా ఈ నియామకాలు దశలవారీగా చేపడుతున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జోన్లో 160, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్లలో 270, వరంగల్ రీజియన్‌లో109 మంది కండక్టర్లను ఔట్సోర్సింగ్ ద్వారా నియమించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు చెప్తున్నారు. తాతాలికంగా నియమించుకున్న కండక్టర్లకు హకీంపేటలోని ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్లో 3 రోజులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత బస్సుల్లో టికెట్ల జారీపై మరో 3 రోజులు అవగాహన కల్పించి టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)ను నేరుగా వారి చేతుల్లో పెట్టనున్నారు.
మిగతా పోస్టుల జాడేది?
ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తామని చెప్పిన ఉద్యోగాల్లో ఇప్పటివరకు డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 వేల పోస్టులు భర్తీచేయాల్సి ఉండగా.. 1,000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటిండెంట్ (మెకానికల్), 25 డిపోమేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), 18 అసిస్టెంట్ ఇంజినీర్ (మెకానికల్), 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్స్ ఆఫీసర్, 7 మెడికల్ ఆఫీసర్ (జనరల్), 7 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్టు) పోస్టుల నియామకాల ఊసే లేదు.
గడువు ముగిసి నెలరోజులైనా..
ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను నేటికీ వెల్లడించకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో ఏ నోటిఫికేషన్ విడుదలైనా దరఖాస్తు తేదీ ముగిసిన వెంటనే ఆ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యను వెల్లడించేవారు. కానీ, ప్రస్తుతం డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు? వారిలో అర్హులు ఎంతమంది? అనే విషయాలు నేటికీ బయటికి రాలేదు. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ గడువు ముగిసి నెలరోజులైనా ఎంతమంది అర్హులనే విషయం వెల్లడి కాకపోవడంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

