Telangana | ఒకే రోజు రూ. 3,000 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేసిన ప్రభుత్వం
Telangana | హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యాసంగిలో రైతాంగానికి సంపూర్ణంగా అండగా ఉండి, పకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి ధాన్యం సేకరణ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే రైతుల ఖాతాల్లోకి రూ. 3,000 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తాన్ని సైతం 20వ తేదీకల్లా రైతులకు అందజేస్తామన్నారు మంత్రి గంగుల.

ఈ యాసంగిలో గురువారం వరకూ 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుండి సేకరించామని మంత్రి తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ. 13,264 కోట్లు అని పేర్కొన్నారు. అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి పది రోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,034 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతు చెంతకే వెల్లి ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సేకరణ పూర్తై 6143 కేంద్రాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని మిగతా జిల్లాల్లోనూ ఆదివారం వరకూ పూర్తి చేస్తామన్నారు. ఎక్కడైనా ఆలస్యంగా కోతలు చేసిన ప్రాంతాల రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారం ఇచ్చామన్నారు. గత సీజన్ కన్నా 15 లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి గంగుల తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!