Adilabad | పెండ్లింట విషాదం.. వరుడిని తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యాన్ బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నేరడిగొండ (జీ)లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
సిరికొండ: ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నేరడిగొండ (జీ)లో ఈ ఘటన చోటుచేసుకున్నది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ(జీ)కి చెందిన యువతికి జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామ యువకుడితో పెండ్లి నిశ్చయమైంది. ఈ నెల 22న (గురువారం) వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయం వరుడిని వధువు ఇంటికి తీసుకొచ్చేందుకు నేరడిగొండ(జి)కి చెందిన 30 మంది మినీ వ్యాన్‌లో బయలుదేరారు. పెండ్లి కొడుకుని తిసుకుని రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో రాత్రి 11.15 గంటల సమయంలో వ్యానును డ్రైవర్ అతివేగంగా నడపడంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిలో నేరడిగొండ(జీ)కి చెందిన కుమ్ర ఈశ్వర్, గంగా ప్రసాద్ ఉన్నారు. క్షతగాత్రులను ఐదు 108 వాహనాల్లో ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించారు. స్వల్ప గాయాలతో వరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

