బీసీ నేతపై ఎస్సైల మూకుమ్మడి ఫిర్యాదు
ఓ బీసీ సంఘం నేత చేసిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన 270 మంది ఎస్సైలు మూకుమ్మడిగా స్పందించారు. ఆ నేతపై ఏకంగా ఒకేరోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసేందుకు క్యూగట్టారు.
- తప్పుడు ఆరోపణలు చేశారంటూ అబిడ్స్ ఠాణాకు క్యూకట్టిన 270 మంది ఎస్సైలు
- ఎక్సైజ్ కమిషనర్‌పై చేసిన ఫిర్యాదుపై స్పందన
- శిక్షణలో ఉన్న ఎస్సైలు బయటకెలా వచ్చారు? అంటూ ప్రశ్నిస్తున్న సొంత శాఖ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఓ బీసీ సంఘం నేత చేసిన ఆరోపణలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు చెందిన 270 మంది ఎస్సైలు మూకుమ్మడిగా స్పందించారు. ఆ నేతపై ఏకంగా ఒకేరోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసేందుకు క్యూగట్టారు. ఆ శాఖ కమిషనర్‌పై చేసిన అవినీతి ఆరోపణలపై వారు స్పందించడం గమనార్హం. 2020 బ్యాచ్‌కు చెందిన ఎక్సైజ్ ఎస్సైల శిక్షణా కాలాన్ని చట్టవిరుద్ధంగా కుదించారని, అందుకోసం ఆబ్కారీ కమిషనర్ ఒకో ఎస్సై నుంచి రూ.30 వేల చొప్పున వసూలు చేశారంటూ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఈ నెల 7న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన 2020 బ్యాచ్‌కు చెందిన 270 మంది ఎక్సైజ్ ఎస్సైలు బుధవారం మూకుమ్మడిగా అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని, యుగంధర్గౌడ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యుగంధర్‌గౌడ్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలు కమిషనర్‌తోపాటు ప్రభుత్వానికి, 2020 బ్యాచ్ ఎస్సైల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నట్టు వారు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. శిక్షణా కాలానికి సంబంధించిన అంశం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నదని వారు పేర్కొన్నారు. అధికారులను, సిబ్బందిని యుగంధర్‌గౌడ్ బ్లాక్మెయిల్ చేస్తూ, వేధిస్తున్నారని, ఎస్సైల విధులకు భంగం కలిగిస్తున్నాడని ఆరరోపించారు.
శిక్షణలో ఉంటూ బయటకెలా వచ్చారు?
2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సైల్లో దాదాపు 130 మంది ప్రస్తుతం ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. సాధారణంగా శిక్షణ సమయంలో అకాడమీ నుంచి బయటకు రావాలంటే కమిషనర్ లేదా ఇతర ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ బుధవారం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ యుగంధర్గౌడ్పై ఫిర్యాదు చేయడానికి 2020 బ్యాచ్‌కు చెందిన 270 మంది ఎస్సైలు అబిడ్స్ ఠాణాకు వచ్చి, ఫిర్యాదు చేసినట్టు ఆబ్కారీ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొనడంపై సొంత శాఖ అధికారులే విస్మయానికి గురవుతున్నారు. వారికి ఎవరు అనుమతి ఇచ్చారని ఆ శాఖ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

