23 నుంచి జేఈఈ మెయిన్-1
జేఈఈ మెయిన్-1 (మొదటి సెషన్) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
- పరీక్ష తేదీల్లో మళ్లీ స్వల్ప మార్పు
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-1 (మొదటి సెషన్) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో గతంలో చెప్పిన తేదీ కంటే 3 రోజులు ఆలస్యంగా జేఈఈ మెయిన్-1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నప్పటికీ పరీక్ష తేదీలు పదే పదే మారడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొన్నది.
ఏ నగరంలో ఎగ్జామ్ రాయబోతున్నారో తెలుసుకోండిలా..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 501 నగరాలతోపాటు, అంతర్జాతీయంగా 22 నగరాల్లో జేఈఈ-1 పరీక్షల ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఏ నగరంలో రాయబోతున్నదీ ముందుగానే తెలుసుకొనేలా విద్యార్థులకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. jeemain. nta.nic.in వెబ్సైట్ను సంప్రదించి.. విద్యార్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ వివరాలను న మోదు చేసి ఏ నగరంలో పరీక్ష రాయబోతున్నారో తెలుసుకోవచ్చని ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- JEE
- JEE Main-1
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

