సీఎం శాఖలోనే అధ్యాపకులకు తిప్పలు!
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ అధ్యాపకులపై విద్యాశాఖ అధికారులు తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్(టీజీఎల్ఏ-711) ఆందోళన వ్యక్తం చేసింది.
- ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్ కోసం 2023 బ్యాచ్ లెక్చరర్ల ఎదురుచూపులు
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ అధ్యాపకులపై విద్యాశాఖ అధికారులు తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్(టీజీఎల్ఏ-711) ఆందోళన వ్యక్తం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్న విద్యాశాఖలోనే ఈ పరిస్థితి నెలకొన్నదని, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిషరిస్తామని సీఎం హామీ ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో చేరి నాలుగో ఇంక్రిమెంట్ తీసుకునే సమయం దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు రెండో ఇంక్రిమెంట్ కూడా విడుదల చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సంఘం నాయకులు మండిపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,100 మంది జూనియర్, డిగ్రీ లెక్చరర్లతో పాటే రెగ్యులర్ అయిన పాలిటెక్నిక్ లెక్చరర్లకు, వైద్యారోగ్య శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఎప్పుడో ప్రొబేషన్ పీరియడ్ ఖరారు చేసింది. అంతేకాకుండా ఇటీవల 2024 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన సూల్ టీచర్లకు కూడా రెండో ఇంక్రిమెంట్ మంజూరైంది. అయితే, ఇతరశాఖల ఉద్యోగులెవరికీ లేని సాంకేతిక ఇబ్బందులు, నిబంధనల కొ ర్రీలు కేవలం ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖల్లో పనిచేస్తున్న అధ్యాపకులకే ఎందుకు ఎదురవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యకు శాశ్వత పరిషారం చూపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్, డిగ్రీ అధ్యాపకులందరినీ సమీకరించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి, ఆందోళనబాట పడుతామని రా ష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

