ప్రభుత్వ టీచర్లకు 20,000 ట్యాబ్‌లు
ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభు త్వ టీచర్లకు 20 వేల ట్యాబ్‌లను విద్యాశాఖ అందజేయనున్నది.
- ఈ విద్యా సంవత్సరంలోఅందజేయనున్న విద్యాశాఖ
- టెండర్ల బిడ్ దాఖలుకు తుది గడువు నేడు
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభు త్వ టీచర్లకు 20 వేల ట్యాబ్‌లను విద్యాశాఖ అందజేయనున్నది. వీటి సేకరణకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీఎస్టీఎస్ఎల్) ఇటీవలే టెండర్లను ఆహ్వానించింది. మంగళవారం ఈ టెండర్ల బిడ్ దాఖలు గడువు ముగియ నున్నది. 2019 -2022 మధ్య కాలంలో మొత్తం 20 వేల ట్యాబ్‌లు ఇచ్చేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ఆమోదిత మండలి గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే.
ఎందుకంటే..
డిజిటల్ విద్యకు బడుల్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవలే ప్రారంభించిన తొలిమెట్టు కార్యక్రమంలోనూ విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం స్టూడెంట్ ట్రాకర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లోనే విద్యార్థుల ప్రగతి నమోదుకు ప్రస్తుతం టీచర్ల వ్యక్తిగత సెల్ఫోన్లను వాడుతున్నారు. తాజాగా అందించే ఈ ట్యాబ్లెట్ పీసీల్లో విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెడతారు.
ప్రయోజనాలు..
- బోధనాసభ్యనలో ట్యాబ్లెట్ పీసీని విరివిగా వినియోగిస్తారు.
- ఎస్సీఈఆర్టీ రూపొందించిన క్యూఆర్‌కోడ్ పుస్తకాలను స్కాన్ చేసి పాఠ్యాంశాల అదనపు సమాచారాన్ని విద్యార్థులకు అందజేస్తారు.
- టీసాట్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిన డిజిటల్ పాఠ్యాంశాలను విద్యార్థులు వినేలా ప్రోత్సహిస్తారు.
- ఎన్సీఈఆర్టీ-దిశ పోర్టల్‌లో టీచర్ల కోసం రూపొందించిన మాడ్యూల్స్ పూర్తికి దోహదపడుతుంది.
- ఉపాధ్యాయుల శిక్షణ, ఆన్లైన్ వర్క్‌షాప్‌లు, వెబినార్లకు హాజరవడానికి టాబ్లెట్ పీసీని ఉపయోగిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

