Tirumala | తిరుమలలో రేపు బ్రేక్ దర్శనాలు రద్దు..
Tirumala | తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది.
Tirumala | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం, గదుల కోటా టికెట్లను శుక్రవారం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. 2.25 లక్షల రూ.300 దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేయగా, కేవలం 21 నిమిషాల్లోనే పూర్తయ్యాయి. వీటి ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం సమకూరింది.
మరో 10 రోజులపాటు రోజుకు 2 వేల చొప్పున ఈ టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్ర్తోక్తంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇదేరోజు శ్రీవారి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనం రద్దు చేశారు. శనివారం బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొన్నది.
పద్మావతి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు షురూ..
తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శన, శిల్పకళా ప్రదర్శన, పుస్తక ప్రదర్శన శాలను ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. చెన్నైకి చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డీఎల్ వసంత్‌కుమార్ తదితరులు అమ్మవారికి ఆరు గొడుగులను కానుకగా అందించారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, వీజీవో బాలిరెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, కంకణ భట్టార్ మణికంఠస్వామి, అర్చకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

