ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు తొలిఅడుగు

- 2న భూమిపూజ చేయనున్నముఖ్యమంత్రి కేసీఆర్
- ప్రజాప్రతినిధులంతా రావాలని మంత్రి కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సెప్టెంబర్ 2న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం వసంత్ విహార్‌లో కేటాయించిన 1200 చదరపు మీటర్ల స్థలంలో పార్టీ ఆఫీసు శాశ్వత భవనం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పలువురు ఇంజినీరింగ్ నిపుణులను ఢిల్లీకి తీసుకెళ్లి భవన నిర్మాణ ప్రణాళికను సిద్ధంచేశారు. పార్టీ కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

