పాలమూరులో రూ.1,999కే సీటీ స్కాన్

ప్రైవేటులోని 20% పడకలు పేదలకు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కాలంలో అనేక మంది నిరుపేదలు ఆర్థిక పరిస్థితి బాగాలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వారి నుంచి అధిక మొత్తం వసూలు చేయవద్దని డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలకు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతులెత్తి విజ్ఞప్తిచేశారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సీటీ స్కాన్ ధరలు రూ. 1,999గా నిర్ణయించినట్టు ప్రకటించారు. ఫిల్మ్‌తో సహా రిపోర్ట్ కావాలంటే రూ.2,790 చెల్లించాల్సి ఉంటుందన్నారు. నిరుపేదలకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు సీటీ స్కాన్ ధరలను రూ.5 వేల నుంచి రూ.1999కి తగ్గించినట్టు వెల్లడించారు. జిల్లాలోని 13 ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నారని ఇందులో 20 శాతం అంటే 269 పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ఈ 269 పడకలను అత్యంత నిరుపేదలకు కేటాయిస్తామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే సదరు దవాఖానను తామే స్వాధీనం చేసుకొని డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

