వీవోఏల వేతనం 8,000కు పెంపు
రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు పెంచడంతో వీరికి లభించే వేతనం రూ.6,900 అయింది.
- ఎస్‌హెచ్‌జీ సహాయకులకు రక్షాబంధన్ కానుక
- రాష్ట్రంలో 17,608 మంది వీవోఏలకు లబ్ధి
- రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు
- ప్రభుత్వంపై రూ.106 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)కు సీఎం కేసీఆర్ రక్షాబంధన్ కానుక అందించారు. వారి వేతనాలను భారీగా పెంచారు. గతంలో వీవోఏలకు అన్నీ కలిపి రూ.6000 మాత్రమే వచ్చేవి. 2021లో ప్రభుత్వం గౌరవ భృతిని 30 శాతం మేరకు పెంచడంతో వీరికి లభించే వేతనం రూ.6,900 అయింది. తాజా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1,100 పెంచడంతో వీవోఏల వేతనాలు రూ.8,000కు పెరిగాయి. సీఎం కేసీఆర్ పెంపు నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీవోఏలకు లబ్ధి చేకూరింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ గురువారమే ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు ఈ నెల (సెప్టెంబర్) నుంచే అమలులోకి వస్తాయి. ప్రభుత్వానికి ఏడాదికి రూ.106 కోట్ల అదనపు భారం పడినా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో వీవోఏల వేతన పెంపు నిర్ణయం తీసుకున్నారు.
ఇతర విజ్ఞప్తులనూ అంగీకరించిన సీఎం
తమకు యూనిఫాం నిధులను అందించాలని, ప్రతి మూడు నెల్లకోసారి అమలవుతున్న రెన్యూవల్ విధానాన్ని ఏడాదికి పెంచాలని, జీవిత బీమా అందించాలని వీఏవోలు చేసిన విజ్ఞప్తులను సైతం సీఎం కేసీఆర్ అంగీకరించినట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం ప్రగతిభవన్‌లో మహిళా సంఘాల ప్రతినిధులకు వేతన పెంపు ఉత్తర్వుల కాపీని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్రా వు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్ అందించారు. వీవోఏల డ్రెస్‌కోడ్ అమలు కోసం ఏడాదికి రూ.2 కోట్లు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ చెప్పారు. జీవిత బీమాకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించినట్టు వెల్లడించారు. గతంలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తీసుకొన్న మానవీయ నిర్ణయంతోనే తమకు నేడు నెల జీతాలతో భరోసా దొరికిందని, తమ ను ఆదరిస్తూ, భరోసాగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని, మంత్రులతో సమావేశమైన వీవోఏలు ప్రకటించారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈవో గౌతమ్ పొట్రు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
వీవోఏల జీతాలు ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ)గా ఏర్పడిన మహిళలకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీవోఏ) సహాయకులుగా పనిచేసేవారు. సంఘానికి సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారాన్ని నోటు బుకుల్లో నమోదు చేసేవారు. వీరి కృషిని నాటి ప్రభుత్వాలు గుర్తించలేదు. మహిళా సంఘాల నుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’గా కేవలం నెలకు రూ.3 వేల గౌరవ వేతనం తప్ప వీవోఏలకు మరో ఆసరా ఉండేది కాదు. పొదు పు సంఘాల్లోని మహిళలను సంఘటితం చే స్తూ, వారిని చైతన్యపరుస్తూ సమన్వయకర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీవోఏ సేవలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గుర్తించారు. వీవోఏలకు కూడా కొంత గౌరవ వేతనం అందించాలని నిర్ణయించారు. 2016 నుంచి వీరికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనంగా అందిస్తున్నది. 2021లో గౌరవ భృతిని ప్రభుత్వం 30 శాతం పెంచడం తో అన్ని వీవోఏ వేతనం రూ.6,900 అయింది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ మరోసారి ఆదుకోవాలని నిర్ణయించారు. వీవోఏల విజ్ఞప్తి మేరకు రాఖీపండుగ కానుకగా మరో రూ. 1,100 మేరకు జీతాలను పెంచారు. దాంతో వీవోఏల మొత్తం వేతనం రూ.8 వేలకు చేరింది.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీవోఏల క్షీరాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీవోఏ) వేతనాలను పెంచిన నేపథ్యంలో వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. వీవోఏల పనితీరుకు సముచిత స్థానం కల్పించిన కేసీఆర్‌కు రూప్సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మారిపల్లి మాధవి, ప్రధాన కార్యదర్శి మశ్చేందర్, స్వతంత్ర యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పేసరు అరుణదేవి, ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణారెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

