హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ కారణంగా 16వ ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు విశ్వసనీయ సమాచారం. సోమవారం సాయంత్రం ప్రారంభోత్సవం నిర్వహించాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రారంభోత్సవం లేదని డీజీపీ ఆఫీస్ నుంచి అతిథులు, ఆహూతులకు సమాచారం వచ్చింది.
గత అక్టోబర్లో ఏర్పాట్లు చేస్తుండగా.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికలు అడ్డు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 29 టీమ్లు రాష్ర్టానికి చేరుకోవడంతో అనధికారికంగా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.