జూన్లో 16% అధిక వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కామారెడ్డి, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్ మాల్కాజిగిరి, ములుగు, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్
సగటు భూగర్భజలం 8.66 మీటర్లు
భూగర్భజల శాఖ నెలవారీ నివేదిక
హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. కామారెడ్డి, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, మేడ్చల్ మాల్కాజిగిరి, ములుగు, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, మహబూబాబాద్, వనపర్తి, జనగామ జిల్లాల్లో 25% అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 8.66 మీటర్లుగా నమోదైంది. ఇది గత ఏడాది జూన్లో నమోదైన 8.52 మీటర్ల కంటే 0.14 శాతం తక్కువ. 25 జిల్లాల్లో సగటు భూగర్భ జలమట్టం 5.10 మీటర్లుగా నమోదైంది.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఈ నెల 5 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా పల్దలో అత్యధికంగా 11.50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

