ప్రభుత్వ దవాఖానల్లో దళితులకు 16% కాంట్రాక్టు ఏజెన్సీలు..ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియను మంత్రి మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు.
TSMIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ తో కలిసి డ్రా ద్వారా హాస్పిటళ్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా..ఆ యూనిట్‌ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.

దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేశారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీర్ది అన్నారు.

ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టె ల మీద దళితులు కూర్చున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. వంద పడకల లోపు హాస్పిటల్‌ను ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ ను మరో కేటగిరిగా విభజించాం. ఏయే హాస్పిటల్లను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయిస్తామన్నారు. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించామని వివరాలను వెల్లడించారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

