25వేల స్కూళ్లకు 16.52 కోట్లు
రాష్ట్రంలోని 25,039 సర్కార్ బడులకు రూ.16.52 కోట్ల స్పోర్ట్స్ నిధులను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
- సర్కారీ బడులకు స్పోర్ట్స్ నిధులు విడుదల
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 25,039 సర్కార్ బడులకు రూ.16.52 కోట్ల స్పోర్ట్స్ నిధులను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఒక్కో ప్రాథమిక స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున స్పోర్ట్స్ నిధులను రిలీజ్ చేశారు. ఈ నిధులతో క్రీడా పరికరాలను కోనుగోలు చేయాలని సూచించారు.
కొనుగోలుచేసేవి ఇవే
ప్లాస్టిక్, చెక్క (వుడెన్) క్రికెట్బ్యాట్లు, వికెట్లు, సాఫ్ట్‌బాల్, టెన్నిస్‌బాల్, ప్లాస్టిక్బాల్స్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, రగ్బీసాఫ్ట్, బీన్బ్యాగ్స్, సాకర్ కోన్, ప్యారాచూట్, షాట్పుట్బాల్స్, డిస్కస్, ఫోమ్ జావెలిన్ వంటి పరికరాలను ప్రాథమిక పాఠశాలలకు కొనుగోలు చేస్తారు. ఉన్నత పాఠశాలలకు వీటితో పాటు అదనంగా స్కిప్పింగ్రోప్, వాలీబాల్, వాలీబాల్ నెట్, త్రోబాల్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను కొనాలని మార్గదర్శకాల్లో సూచించారు.
100 శాతం స్కూల్ గ్రాంట్
రాష్ట్రంలోని సర్కారు బడులకు కాంపోజిట్ స్కూల్ గ్రాంట్‌ను సైతం 100 శాతం విడుదల చేశారు. ఇదివరకు 50 శాతం గ్రాంట్‌ను విడుదలచేయగా, తాజాగా మొత్తం గ్రాంట్‌ను విడుదల చేశారు. 26,337 బడులకు మొత్తం రూ. 74.16 కోట్లకు గాను మొదటి విడతలో 50 శాతం నిధులు రూ. 37.08 కోట్లు, రెండోవిడతలో మరో 50 శాతం నిధులు 37.08 కోట్లను విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

