Telangana | మోటర్లు నడపాలె నిధులివ్వండి.. ఎత్తిపోతలకు సిద్ధమైనా మొదలు పెట్టలేని దుస్థితి!
‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్టు తయారైంది ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి! ఎత్తిపోతలకు సిద్ధమైనా.. మొదలు పెట్టలేని దుస్థితి దాపురించింది! మోటర్ల బిగింపు పూర్తయినా వాటిని నడిపి చూద్దామంటే పవర్ సర్వీస్ కనెక్షన్ లేక ‘సీతారామ’, ‘పాలమూరు రంగారెడ్డి’ ప్రాజెక్టుల్లో పంపుల డ్రైరన్ కోసం అధికారులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
- పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం, ఏదుల పంప్‌హౌస్‌లు సిద్ధం
- ‘సీతారామ’లోనూ 3 పంప్‌హౌస్‌లు పూర్తి.. డ్రైరన్ కోసం ఎదురుచూపు
- విద్యుత్తు సరఫరా కోసం నిరీక్షణ.. ట్రాన్స్‌కోకు చార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్
- 160 కోట్లకు అధికారుల ప్రతిపాదనలు.. సర్కారు నుంచి స్పందన కరువు
Telangana | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ‘అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్టు తయారైంది ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి! ఎత్తిపోతలకు సిద్ధమైనా.. మొదలు పెట్టలేని దుస్థితి దాపురించింది! మోటర్ల బిగింపు పూర్తయినా వాటిని నడిపి చూద్దామంటే పవర్ సర్వీస్ కనెక్షన్ లేక ‘సీతారామ’, ‘పాలమూరు రంగారెడ్డి’ ప్రాజెక్టుల్లో పంపుల డ్రైరన్ కోసం అధికారులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు.
విద్యుత్తు సరఫరా కోసం నిధులు కావాలని మొరపెట్టుకున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు కనికరించడం లేదు. సీతారామ, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్లలోని పలు పంపింగ్ స్టేషన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మోటర్ల బిగింపు కూడా పూర్తయింది. వీటి పనితీరును పరీక్షించేందుకు, విడిభాగాలను సంరక్షించేందుకు డ్రై రన్ నిర్వహించాల్సి ఉంది. ఏవైనా లోపాలుంటే మోటర్లు సరఫరా చేసిన ఏజెన్సీలతోనే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అన్నీ సిద్ధమైన తర్వాత పంపుల వెట్న్ నిర్వహించాలి.
ఈ క్రమంలో ప్రస్తుతం ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటర్ల బిగింపు పూర్తయినా డ్రై రన్ కోసం అధికారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఆయా పంపింగ్ స్టేషన్లకు పవర్ సర్వీస్ కనెక్షన్ లేకపోవడమే ఇందుకు కారణం. ఎన్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్‌కోకు సర్వీస్ కనెక్షన్ చార్జీలు చెల్లించాలని, మోటర్లను తిప్పిచూడాల్సి ఉందని ప్రభుత్వానికి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వీస్ కనెక్షన్ కోసం ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు కూడా పంపారు.
‘సీతారామ’కు రూ.22కోట్లు
ఈ పథకంలో మొత్తం మూడు పంపింగ్ స్టేషన్లున్నాయి. మొదటి స్టేషన్లో 25మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటర్తో కూడిన వాల్యూట్ పంపులను, రెండో స్టేషన్లో 40మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటర్లతో కూడిన ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు, మూడో స్టేషన్లో 40మెగావాట్ల సామర్థ్యం గలవి 5,30 మెగావాట్ల సామర్థ్యం గల 2 ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయి. కానీ, పంపింగ్ స్టేషన్లకు ఇప్పటివరకు పవర్ సర్వీస్ కనెక్షన్ ఏర్పాటు చేయలేదు. సర్వీస్ కనెక్షన్ కోసం మొత్తం రూ.22కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ నిధులను చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో సర్వీస్ కనెక్షన్ ఇవ్వడం లేదు.
పాలమూరుకు రూ.124కోట్లు
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌లో మొత్తం నాలుగు పంపింగ్ స్టేషన్లు ఉండగా, ఉద్దండాపూర్ మినహా మూడు సిద్ధమయ్యాయి. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ 145 మెగావాట్ల సామర్థ్యంతో 8, ఏదుల పంపింగ్ స్టేషన్ 9, వట్టెం పంపింగ్ స్టేషన్లో 9 పంపులు ఏర్పాటు చేశారు. డ్రైరన్ కోసం ఇవికూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పంపింగ్ స్టేషన్-1 (నార్లాపూర్)లో రెండు పంపులను డ్రైరన్, వెట్న్‌న్రు విజయవంతంగా నిర్వహించారు.
ఏదుల, వట్టెం పంపుల డ్రై రన్, వెట్ రన్ కోసం విద్యుత్ సరఫరా లేక ప్రక్రియ నిలిపివేశారు. వీటికి సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలంటే ఒకో పంపింగ్ స్టేషన్‌కు దాదాపు రూ.62 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తంగా రూ.124కోట్లు విడుదల చేస్తే డ్రైరన్, వెట్న్ నిర్వహిస్తామని చెబుతున్నారు.
ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని చెబుతున్నారు. పంపులను సరఫరా చేసిన ఏజెన్సీల అగ్రిమెంట్ పూర్తికాకముందే డ్రైరన్, వెట్న్ నిర్వహించాలని, ఏవైనా లోపాలు తలెత్తినా, మరమ్మతులు చేయాల్సి ఉన్నా సదరు ఏజెన్సీతోనే చేయించే అవకాశముంటుందని తెలుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే ట్రాన్స్‌కోకు నిధులు చెల్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

