హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్తగా 121 లిక్కర్ బ్రాండ్లు రానున్నాయి. ఇందుకుగాను దాదాపు 18 కంపెనీలకు చెందిన లిక్కర్ సప్లయర్స్ దరఖాస్తులు చేసుకున్నట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మేరకు అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్న 18 లికర్ సప్లయర్స్‌కు సంబంధించిన 121 లికర్ బ్రాండ్లను tgbcl.telagana.gov.in వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు సెప్టెంబర్ 1లోపు తెలియజేయాలని టీజీబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ సీ హరికిరణ్ సూచించారు.