ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్‌కు జై!
ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎంపికైన సుమారు వెయ్యి మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరి నియామకాలకు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తవడంతోపాటు ఆగస్టు 3నే తుది జాబితా కూడా సిద్ధమైంది. అయినా ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు.
- 1,000 మంది డ్రైవర్ అభ్యర్థుల ఎదురుచూపు
- తుది జాబితా సిద్ధమైనప్పటికీ ఆగిన నియామకాలు
- అవుట్ సోర్సింగ్ సిబ్బందితోనే బస్సుల డ్రైవింగ్
- ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎంపికైన సుమారు వెయ్యి మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరి నియామకాలకు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తవడంతోపాటు ఆగస్టు 3నే తుది జాబితా కూడా సిద్ధమైంది. అయినా ఇప్పటివరకు పోస్టింగులు ఇవ్వలేదు. డ్రైవర్ పోస్టులకు ఎంపికైనట్టు వీరందరికీ సమాచారం అందినప్పటికీ కాల్ లెటర్లు మాత్రం రాలేదు. దీంతో విధుల్లో చేరే అవకాశం లేక వీరంతా ఎదురుచూపులకే పరిమితమయ్యారు.
వీరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరికి నెలకు దాదాపు రూ.26 వేల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. కొత్తగా ఎంపికైన డ్రైవర్లకు కన్సాలిడేటెడ్ వేతనంగా రూ.20,500 చెల్లించే ప్రతిపాదన ఉన్నదని, 240 రోజులపాటు విధులు నిర్వహించాక సర్వీసును రెగ్యులరైజ్ చేస్తామని అధికారులు వారికి వివరించినట్టు తెలుస్తున్నది. దీంతో అన్ని పరీక్షలను అధిగమించి డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపికైన తమను పకనపెట్టి అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపించడం సమంజసం కాదని అభ్యర్థులు మండిపడుతున్నారు.
ఇతర ఉద్యోగాలకూ వెళ్లలేక..
నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో సమస్య ఎదురవుతున్నది. ఆర్టీసీ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఇతర డ్రైవింగ్ ఉద్యోగాల్లో చేరేందుకు వారు వెనుకాడుతున్నారు. లారీలు, ఇతర రవాణా సంస్థల్లో డ్రైవర్‌గా చేరాలంటే సాధారణంగా ఏడాదిపాటు పనిచేందుకు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఒప్పందాల్లో చేరాక తమకు కాల్ లెటర్లు వస్తే మధ్యలో ఉద్యోగం వదిలి రావడం కష్టమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో ఇటు ఆర్టీసీ ఉద్యోగం రాక, అటు ఇతర ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెలెక్షన్ కమిటీ సభ్యులకు ముడుపులు?
ఆర్టీసీ డ్రైవర్ల నియామక ప్రక్రియకు సంబంధించి మరో వివాదం కూడా తెరపైకి వస్తున్నది. సెలెక్షన్ కమిటీలోని కొందరు వ్యక్తులు మధ్యవర్తుల ద్వారా ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6 లక్షల వరకు ముడుపులు పుచ్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

