TGSRTC | రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ రికార్డు.. వరుసగా మూడు రోజులు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు
TGSRTC | రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ గత రికార్డులు అన్నింటినీ తిరగరాసిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రికార్డుస్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని వెల్లడించారు. వరుసగా మూడు రోజులు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైందని పేర్కొన్నారు.
TGSRTC | రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ గత రికార్డులు అన్నింటినీ తిరగరాసిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రికార్డుస్థాయిలో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని వెల్లడించారు. వరుసగా మూడు రోజులు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదైందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 లక్షల మంది తమ బస్సుల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు తిరిగాయని తెలిపారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి నాడు 21 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్) నమోదవ్వగా.. ఈసారి 97 డిపోలు ఆ మైలురాయి దాటాయని పేర్కొన్నారు.
రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై క్షేత్ర స్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్బుతంగా పనిచేశారని కొనియాడారు. భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు.
అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదు చేసిన మహబుబ్‌నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్, కరీంనగర్ రీజియన్ల ఆర్ఎంలను సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజూరాబాద్, దుబ్బాక, కల్వకుర్తి, ముషీరాబాద్, దేవరకొండ, తొర్రూర్, నార్కట్‌పల్లి, షాద్‌నగర్ డిపోలు అత్యధిక ఓఆర్‌ను నమోదు చేశాయని, ఆయా డీఎంలకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పనితనాన్ని యాజమాన్యం గుర్తిస్తుందని, రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తుందని సజ్జనార్ తెలిపారు. టీజీఎస్ఆర్టీసీని ఆదరిస్తూ.. వెన్నుదన్నుగా నిలుస్తోన్న ప్రయాణికులు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

