హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమమస్తే తెలంగాణ): హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాత్కాలికంగా ఆగనున్నాయి. దసరా, దీపావళి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలిక స్టాప్ల సౌకర్యాన్ని రైల్వే కల్పించింది. ఇప్పటికే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ స్టేషన్ల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా బోర్డింగ్ పాయింట్‌ను హైటెక్ సిటీకి మార్చుకోవచ్చని రైల్వే అధికారులు సూచించారు.