ఎన్‌హెచ్-65 విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా జాతీయ రహదారి-65 ఆధునీకరణకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మొత్తం 285 కి.మీ. రహదారిని రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో 6 వరుసల హైస్పీడ్ కారిడార్‌గా విస్తరించాలన్న ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది.
- రూ.12,073 కోట్ల భారీ బడ్జెట్‌తో 6+2 లేన్ల రహదారి
- ‘చింతన్ శివిర్-2026’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం
- హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రమాదాల తగ్గింపే ధ్యేయం
- జీరో ఫెటాలిటీస్’ లక్ష్య సాధనతో ప్రయాణాలు సురక్షితం
- త్వరలో టెండర్ల ఆహ్వానం.. 2030 నాటికి పనులు పూర్తి
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా జాతీయ రహదారి-65 ఆధునీకరణకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు మొత్తం 285 కి.మీ. రహదారిని రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో 6 వరుసల హైస్పీడ్ కారిడార్‌గా విస్తరించాలన్న ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్-పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించనున్నారు.
హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 181.30 కి.మీ. పొడవైన ప్యాకేజీ-1 పనులను రూ.6,792.52 కోట్లతో, నందిగామ నుంచి విజయవాడ వరకు 45 కి.మీ. పొడవైన ప్యాకేజీ-2 పనులను రూ.2,965.11 కోట్లతో బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (బీవోటీ) పద్ధతిలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.695 కి.మీ పొడవైన ప్యాకేజీ-3 పనులను రూ.806.77 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో చేపట్టనున్నారు.
ఇందుకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణ పనులతో కలిపి కిలోమీటర్‌కు సగటున సుమారు రూ.38 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టులో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ప్రధాన 6 లేన్ల రహదారికి ఇరువైపులా క్రాష్ బారియర్లు, అదనంగా రెండు వరుసల సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. స్థానిక ట్రాఫిక్ ప్రధాన క్యారేజ్ వేపైకి రాకుండా నిరోధించేందుకు వీలుగా ప్రతి 15-18 కిలోమీటర్లకు మాత్రమే ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ తరహాలో ప్రయాణించిన దూరానికి మాత్రమే వాహనదారులు ఆటోమేటిక్‌గా రుసుము చెల్లించేలా సరికొత్త టెక్నాలజీతో కూడిన టోల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తారు.
మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం
గుజరాత్‌లోని ఏక్తా నగర్లో ఇటీవల జరిగిన ‘చింతన్ శివిర్-2026’ సదస్సులో తెలంగాణ ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ రహదారిని 6+2 లేన్లకు విస్తరించాలని కోరడంతో గడ్కరీ సానుకూలంగా స్పందించారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో త్వరలోనే ఎన్‌హెచ్-65 విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 2030లోగా ఈ పనులు పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
యాక్సెస్ కంట్రోల్డ్ హైస్పీడ్ కారిడార్
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే/యాక్సెస్ కంట్రోల్డ్ హైస్పీడ్ కారిడార్ ప్రమాణాలతో ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మీదుగా ఈ రోడ్డు విస్తరణ సాగనున్నది. ఇందుకు రెండు రాష్ట్రాల పరిధిలో అవసరమైన భూమిలో అత్యధిక భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్నది. అదనంగా తెలంగాణ పరిధిలో 213.33 హెక్టార్లు, ఏపీ పరిధిలో కేవలం 6.50 హెక్టార్ల ప్రైవేట్ భూమి మాత్రమే సేకరించాల్సి ఉన్నది.
‘జీరో ఫెటాలిటీస్’ లక్ష్య సాధన దిశగా..
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన ఆర్థిక జీవనాడిగా ఉన్న హైదరాబాద్-విజయవాడ మార్గ ంలో నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి రద్దీకి 4 లేన్ల రహదారి సరిపోకపోవడంతో తరచుగా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 6 మెయిన్ లేన్లు, 2 సర్వీసు రోడ్ల (6+2) వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రమాదాలు, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతాయి. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలన్న ‘జీరో ఫెటాలిటీస్’ లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపకరిస్తుంది. మార్గమధ్యంలోని పట్టణాలు, మున్సిపాలిటీల వద్ద ప్రత్యేక బైపాస్‌ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిషారమవుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

