100 కోట్ల లూటీపై విచారణ జరపాలి
భవన నిర్మాణ కార్మికుల బీమా సొమ్ము రూ.100 కోట్ల లూటీపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్టీయూ నేత, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పులిపాటి నారాయణ డిమాండ్ చేశారు. ట్రైల్బ్లేజర్ ఏజెన్సీ పేరిట నిధులు పక్కదారిపట్టాయని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, వెల్ఫేర్ బోర్డు అనాలోచిత నిర్ణయాలతో కార్మికులకు దక్కాల్సిన సొమ్ము దళారుల పాలైందని మండిపడ్డారు.
- ట్రైల్బ్లేజర్ ఏజెన్సీ పేరిట నిధులు పక్కదారి
- కార్మిక శాఖ కమిషర్‌కు బీఆర్టీయూ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణ కార్మికుల బీమా సొమ్ము రూ.100 కోట్ల లూటీపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్టీయూ నేత, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ పులిపాటి నారాయణ డిమాండ్ చేశారు. ట్రైల్బ్లేజర్ ఏజెన్సీ పేరిట నిధులు పక్కదారిపట్టాయని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, వెల్ఫేర్ బోర్డు అనాలోచిత నిర్ణయాలతో కార్మికులకు దక్కాల్సిన సొమ్ము దళారుల పాలైందని మండిపడ్డారు.
ట్రైల్బ్లేజర్ ఏజెన్సీ కార్మికులకు బీమా సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని ధ్వజమెత్తారు. ప్రమాదాల్లో గాయపడ్డ, మరణించిన కార్మికుల క్లెయిమ్‌ల ఆమోదానికి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. బోర్డు ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లోపంతోనే సదరు ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఏజెన్సీ అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

