మేడ్చల్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాలు
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాల అటవీ ప్రాంతంలో అరుదైన ప్రాచీన కళా సంపద వెలుగు చూసింది.
మేడ్చల్, శామీర్పేట, నవంబరు 17: మేడ్చల్ జిల్లాలోని మూడుచింతపల్లి మున్సిపాలిటీ పొన్నాల అటవీ ప్రాంతంలో అరుదైన ప్రాచీన కళా సంపద వెలుగు చూసింది. పరిశోధకుడు కొండవీటి గోపి, చరిత్ర, వారసత్వ అన్వేషకుడు మహ్మద్ నసీరుద్దీన్, మార్గదర్శకుడు సంగమేశ్ సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాన్ని గుర్తించారు. పొన్నాల్ అటవీ ప్రాంతంలోని భారీ గ్రానైట్ రాతిగుట్టలో సహజంగా ఏర్పడిన రాక్ షెల్టర్ లోపలి పైకప్పు పై ఎరువు రంగులో చిత్రించిన అనేక ప్రాచీన చిత్రాలు బయటపడ్డాయి.
మానవ ఆకృతులు, వేట దృశ్యాలు, వివిధరకాల వన్యప్రాణులు, రేఖాగణిత, నైరూప్య ఆకృతులు ఉన్నాయి. ఇవి ప్రాచీన మానవుల జీవన విధా నం, కళాత్మక నైపుణ్యం, ప్రకృతితో వారికున్న అనుబంధాన్ని అధ్యయనం చేయడానికి విలువైన ఆధారాలుగా నిలువనున్నాయి. ఈ చిత్రాలు 5 వేల నుంచి 2,500 సంవత్సరాల క్రితం నాటి సంప్రదాయాలతో సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

