బెదిరింపులపై చర్యలు తీసుకోండి
ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.
- డీజీపీ సీవీ ఆనంద్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్ విజ్ఞప్తి
- ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వలేదని వెల్లడి
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో తనకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరినట్టు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. ఇటీవలి కాలంలో తాను చేసిన వ్యాఖ్యల కారణంగా వస్తున్న వేధింపులను అడ్డుకోవాలని మంగళవారం డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చా.
ఈ విషయంలో నేను ఎలాంటి సెక్యూరిటీ అడుగలేదు. అది నేను నిర్ణయించేది కాదు. నేను అడిగింది ఒకటే.. అవసరమైన చర్యలు తీసుకోండి అని చెప్పాను. నేను చేసిన కామెంట్స్‌ను ఆల్రెడీ వెనక్కి తీసుకొన్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. క్యాడర్‌కు కూడా విజ్ఞప్తి చేసింది. ఇది ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం గురించి మళ్లీ ఎందుకు మాట్లాడటం. ఏపీ పోలీసులు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు.
వాట్సాప్‌లో కూడా అలాంటిదేమీ రాలేదు. నా వినతిని డీజీపీ పరిశీలిస్తామన్నారు’ అని నాగేశ్వర్ తెలిపారు. ఇటీవల ఏపీ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా.. పలుచోట్ల ఆయన్ను అరెస్టు చే యాలని పోలీసులకు ఫిర్యాదులు సైతం అందాయి. ఏపీ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టోలిచౌకి సబ్జా కాలనీలోని ఆయన ఇంటివద్ద మంగళవారం తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏపీ పోలీసుల తీరు అన్యాయం: ఏఐవైఎఫ్
ప్రజా సమస్యలపై నిరంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విధానాలను విశ్లేషిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు అత్యంత ఆందోళనకర పరిణామమని అఖిల భారత యువజన సమాఖ్య పేర్కొంది. సోమవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలిఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యవ్యవస్థలో భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచడం రాజ్యాంగం కల్పించిన హకు అని, అలాంటి హకులను అణచివేయడానికి ఏపీ కూటమి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

