దళితబంధుతో చరిత్ర సృష్టించబోతున్నాం

- సాహసోపేత నిర్ణయాలు ఒక్క కేసీఆర్‌కే సాధ్యం
- దళితుల సంక్షేమాన్ని కోరుకునేవారు స్వాగతించాలి
- మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం ప్రారంభిస్తున్న దళితబంధు పథకం దేశంలోనే చరిత్ర సృష్టించబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజీగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మాట్లాడుతూ.. దళితబంధు పథకం రాజకీయ పార్టీల దిశ, దశను మార్చబోతున్నదన్నారు. ప్రజల సంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడం ఒక్క సీఎం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. దళితులపై ప్రేమ ఉన్నవారు, దళితులు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకునేవారు దళితబంధు పథకాన్ని స్వాగతించాలని సూచించారు. విమర్శలు మాని.. ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయం నిజమైన, అర్హులైన వారికి దక్కేవిధంగా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కోరారు. రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ఏమి జరుగలేదని, ఎన్నికల కోసమే హడావిడిగా ఈ పథకం ప్రకటించారనే నిరాధార విమర్శలను ఆయన ఖండించారు. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలుండగా వాటిలో దాదాపు 15 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకానికి అర్హత ఉన్నదన్నారు. వీరందరికి ఒకే సంవత్సరంలో ఆర్థిక సహాయం అందించకపోయినా.. వచ్చే ఐదారేళ్లలో పూర్తిగా అందిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో సంవత్సరానికి రూ.25 వేల కోట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గతంలో నీటిపారుదల రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టుగానే, దళిత బంధుకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణ లక్ష్మి, మిషన్‌భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలాగే విమర్శించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను విజయవంతంగా అమలు చేసి చూపిందన్నారు. దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చే ముందు పలు పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అమలు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

