కీసరగుట్టలో జమ్మి మొక్క నాటిన మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్
Keesaragutta | కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు

మేడ్చల్ మల్కాజ్గిరి : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయంలో మల్లారెడ్డి, సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

