మట్టి కొట్టుక పోతవ్
మట్టి కొట్టుక పోతవ్ | బీజేపీ నేత ఈటల వల్ల మరణించిన ఓ వ్యక్తి తల్లి కడుపు మండింది. మట్టి కొట్టుకపోతవ్ అని శాపనార్ధాలు పెట్టింది.
- నా కొడును పొట్టన పెట్టుకున్నవు
- రాజేందర్‌పై దుమ్మెత్తి పోసిన ప్రవీణ్ తల్లి
- సమాధానం చెప్పకుండానే జారుకున్న ఈటల
- బయట పడుతున్న బీజేపీ నేత అకృత్యాలు

కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్: ఓ తల్లి కడుపు మండింది. బీజేపీ నేత ఈటలపై తిరగబడింది. తన కొడుకు చావుకు రాజేందరే కారణమంటూ దుమ్మెత్తి పోసింది. ‘మట్టి కొట్టుకపోతవ్’ అంటూ శాపనార్థాలు పెట్టింది. కన్న కొడుకును దూరం చేశారంటూ కన్నీరు మున్నీరుగా రోదించింది. ‘ఏ ముఖం పెట్టుకోని మా ఊరికి వచ్చినవ్. మా ఉసురు నీకు తగులుద్ది’ అంటూ ఆ తల్లి ఆవేదనతో బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై దుమ్మెత్తిపోసింది. నా కొడుకును పొట్టన పెట్టుకున్న నువ్వు బాగు పడవంటూ శాపనార్థాలు పెట్టింది.

ఉద్యోగం తీసేసి కక్ష
ప్రవీణ్ యాదవ్ హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో కేసీఆర్ కిట్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే కోపంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఉద్యోగం కోసం ఈటల కాళ్లమీద పడ్డా ఆయన కనికరించలేదు.
దాంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయి కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు కారణం ఈటల రాజేందరే అంటూ తల్లిదండ్రులు అప్పట్లోనే ఆరోపించారు.
మంగళవారం రాజేందర్ కనిపించడంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. ‘నా కొడుకు చనిపోవడానికి కారణం నువ్వే. నువ్వు నాశనం అయిపోతవ్. మట్టి కొట్టుక పోతవ్ అంటూ’ శాపనార్థాలు పెట్టింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చిన ఆ తల్లిని స్థానికులు సముదాయించారు.
పరిస్థితి గమనించిన రాజేందర్, ఆయన అనుచరులు అక్కడినుంచి చల్లగా జారుకొన్నారు. రాజేందర్ వెళ్లిపోయాక కూడా ఆ తల్లి అరగంట పాటు కొడుకును తలుచుకుంటూ గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
- Tags
- Eetala Rajender
- huzurabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

