కోవిడ్ వేళ పేదలకు వరంగా మారిన సేవాభారతి

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ సేవా భారతి పేద ప్రజలకు వరంలా మారింది. హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 200 పడకలు ఉన్న ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్లైన్ ద్వారా సలహాలందిస్తున్నారు.
ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

