అభివృద్ధి చూసి ఆశీర్వదించండి
‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, రంగంపేట, రహీంఖాన్ పేట, వెల్జీపూర్, ఓగులాపూర్, గూడెప్పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు.
- వచ్చే ఐదేండ్లు మరింత సేవ చేస్త
- మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్
- ఇల్లంతకుంట మండలంలో ప్రచారం
ఇల్లంతకుంట, నవంబర్ 10: ‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, రంగంపేట, రహీంఖాన్ పేట, వెల్జీపూర్, ఓగులాపూర్, గూడెప్పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రంగంపేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెప్పారు. ‘బిడ్డా నువ్వే మళ్లీ గెలుస్తవ్’ అంటూ రంగంపేటలో ఓ వృద్ధురాలు దీవించడంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను గెలిచిన తర్వాత కందికట్కూర్లో ఎల్లమ్మ ఆలయం రోడ్డులో నూతన బ్రిడ్జి, బీరప్ప ఒర్రెపై నూతన బ్రిడ్జి నిర్మిస్తామనని హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రొండ్ల తిరుపతిరెడ్డి, అన్నాడి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana-assembly-elections-2023 News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

