బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 2 శాతం సవరిస్తున్నట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.
హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. సోమవారం (జూలై 3) నుంచి వివిధ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది.