తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో మనస్పర్ధలు రావచ్చు. అనుకోని ఖర్చులు వస్తాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. వారాంతంలో
కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
గతంతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సలహాలు పాటించి లబ్ధి పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. వ్యాపారులకు అనువైన సమయం. సంఘర్షణ వాతావరణం నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. పెద్దల సహకారం పొందుతారు. కళాకారులకు కొత్త అవకాశాలు. రాబడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా.. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. ఇంటా బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. స్థిరాస్తి ద్వారా ఆదాయం సంప్రాప్తిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకుసాగుతారు. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించాలి. స్నేహితుల వల్ల కార్యసాఫల్యం ఉంది. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు. శుభకార్య యత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆహార నియమాలు పాటించాలి. వారాంతంలో శుభవార్త వింటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
ఈ వారం అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గతంలోని పెట్టుబడులకు ప్రతిఫలాలు పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విహార యాత్రలు చేపడతారు. విందు, వినోదాలకు హాజరవుతారు. సూర్యారాధన మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురి సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. మొండి బకాయీలు వసూలు అవుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు రాణిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రామాలయాన్ని సందర్శించండి.
ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రతిష్ఠ పెరుగుతుంది. చాలా రోజులుగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మానసిక సంఘర్షణను అధిగమిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసభ్యులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. అనుభవజ్ఞుల సలహాలు అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగులకు మంచి సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రణాళికా బద్ధంగా బాధ్యతలు నిర్వర్తించి మెప్పు పొందుతారు. వాహనాల విషయంలో జాగ్రత్త. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
సమయానికి తగిన నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు పొందుతారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. నూతన పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తారు.
తలపెట్టిన పనులను ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. ఆలోచనలను ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. విష్ణుమూర్తి ఆరాధన మేలు చేస్తుంది.
శుభకార్య యత్నాలు ముందుకుసాగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారులకు కలిసివస్తుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి సమయం. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పనులు నెరవేరుతాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
శుభకార్యాలతో ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సహోద్యోగులతో స్నేహాన్ని పెంచుకుంటారు. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆస్తి తగాదాలు తీరుతాయి. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పనుల్లో పట్టుదల అవసరం. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు మంచి సమయం. హనుమత్ ఆరాధన శుభప్రదం.
ఈ వారం అనుకూలంగా ఉంది. బాకీలు వసూలు అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in