మారిన రూపురేఖలు
ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట నేడు జిల్లా కేంద్రాలుగా ఉన్న ఇవన్నీ పదేండ్ల కిందట వరకు మామూలు గ్రామాలు. కాదంటే మేజర్ గ్రామ పంచాయతీలు, మరి కాదంటే మూడో గ్రేడ్ మున్సిపాలిటీలు. పదేండ్ల కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.
ములుగు, ఆసిఫాబాద్, మహబూబాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట నేడు జిల్లా కేంద్రాలుగా ఉన్న ఇవన్నీ పదేండ్ల కిందట వరకు మామూలు గ్రామాలు. కాదంటే మేజర్ గ్రామ పంచాయతీలు, మరి కాదంటే మూడో గ్రేడ్ మున్సిపాలిటీలు. పదేండ్ల కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. మొన్నటి వరకు పల్లెలుగా, నగర పంచాయతీలుగా ఉన్న ఊళ్లు నేడు అభివృద్ధి చిహ్నాలుగా నిలిచే స్థాయికి చేరుకున్నాయి. ఉడుపి హోటల్, నేషనల్ బ్యాంకులు సైతం లేని చిన్న పట్టణాలు నేడు మాల్స్, డిమార్ట్‌లు, నేషనల్, ప్రైవేట్ బ్యాంకులతో అలరారుతున్నాయి.
కొత్త జిల్లాల్లో సర్వీస్ సెక్టార్ విస్తరించింది. సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చే ఆదాయం క్రమంగా పెరిగింది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు తదుపరి బ్యాంకింగ్ సేవలు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించాయి. హోటల్స్, మాల్స్, ఫోర్‌వీలర్, టూవీలర్, ట్రాక్టర్లు, వ్యాన్ల షోరూమ్‌లు, బంగారం, వెండి వ్యాపారాలను నిర్వహించే కార్పొరేట్ నగల షాపులు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ విక్రయించే దుస్తుల దుకాణాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం, రెస్టారెంట్ కల్చర్ పెరిగిపోయింది.
ఒకప్పుడు కలల ప్రపంచంలా ఉండే సర్వీస్ సెక్టార్ నేడు చిన్నచిన్న పట్టణాలకు విస్తరించింది. ఇవి ప్రజల ఆర్థిక విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2016లో 4,648 బ్యాంకులు (అన్ని సెక్టార్లలో కలిపి) ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 8,320 వరకు చేరుకుంది. పదేండ్ల క్రితం బ్యాంకుల్లో రూ.32,81,050 కోట్ల డిపాజిట్లు, రూ.33,89,147 కోట్ల క్రెడిట్స్ ఉండగా, 2024 నాటికి రూ.45,88,290 కోట్ల డిపాజిట్లు, రూ.48,15,357 కోట్ల క్రెడిట్స్‌కు చేరుకున్నాయి. పదేండ్ల క్రితం హోటల్స్, ట్రేడింగ్ రంగాల నుండి కేవలం 13 శాతం మాత్రమే ఆదాయం సమకూరగా నేడు ఇది 19 శాతానికి చేరుకుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

