తల్లీ! నువ్వు పుట్టుకతోనే అందగత్తెవి. ఆ విషయం నీతో ఎవరూ చెప్పలేదంతే. -నాన్న (బాడీ షేమింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన టీనేజ్ అమ్మాయి సమాధిపై శిలాక్షరాలు)
‘నా గతమంతా చేదే. నీకు ప్రేమ తీపిని పంచలేను’ తిరస్కరించింది ఆమె. ‘నాకు పుట్టుకతోనే మధుమేహం.
చేదు కొత్త కాదు. విల్ యు మ్యారీ మీ’ మరోసారి బతిమాలాడు.
‘లివర్ బాగా పాడైపోయింది. మీరు మద్యం తాగుతారా?’ అడిగాడు వైద్యుడు. ‘లేదు సర్’ నిజమే చెప్పాడు
ఆ లిక్కర్ కింగ్. అయినా సరే.. కర్మ ఫాలోస్!
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు నాన్నలో.. భోజనం వడ్డిస్తున్నప్పుడు
అమ్మలో.. గిఫ్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తున్నప్పుడు అన్నయ్యలో.. అతణ్ని చూసేదాన్ని.
అతను ఐడియాలతో ప్రేమలో పడ్డాడు! కాబట్టే, ‘ఆంత్రప్రెన్యూర్’ అయ్యాడు