Spam Message | స్పామ్ మెసేజ్‌ల దాడిని స్మాష్ చేద్దామిలా..
సాంకేతిక ప్రపంచం స్మార్ట్‌నెస్ సంతరించుకునే కొద్దీ... స్కామర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అలా వాళ్లు సంధిస్తున్నవే సందేశాస్ర్తాలు. తలాతోకా లేని చిరునామాతో బల్క్‌గా పంపే మెసేజ్‌లు వినియోగదారుల పాలిట ఉచ్చుల్లా మారుతున్నాయి.
వేగుల సందేశం రాజును అప్రమత్తం చేస్తుంది. గొప్ప నాయకుడి సందేశం జాతిని చైతన్యపరుస్తుంది. ఆప్తమిత్రుడి సందేశం అంతులేని ఉత్సాహాన్నిస్తుంది. చెలికాడి నుంచి వచ్చే వాట్సాప్ సందేశం చిన్నదాని చెక్కిళ్లను ఎరుపెక్కిస్తుంది. కానీ, వేళాపాళ లేకుండా ఫోన్లోకి చొరబడే కొన్ని సందేశాలు సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. సమస్యల్ని మోసుకొస్తున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేస్తున్నాయి. స్పామ్ మెసేజ్లుగా పేరు బడిన ఈ సందేశాలను నిమిషానికొకటి పంపుతూ కోట్ల రూపాయల మేర కొల్లగొడుతున్నారు స్కామర్లు.
Spam Message | సాంకేతిక ప్రపంచం స్మార్ట్‌నెస్ సంతరించుకునే కొద్దీ… స్కామర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అలా వాళ్లు సంధిస్తున్నవే సందేశాస్ర్తాలు. తలాతోకా లేని చిరునామాతో బల్క్‌గా పంపే మెసేజ్‌లు వినియోగదారుల పాలిట ఉచ్చుల్లా మారుతున్నాయి. వచ్చిన ప్రతి మెసేజ్‌ను చూసే అలవాటు ఉంటే తప్పులేదు. కానీ, ఊరించే ఆఫర్లతో ఊడిపడే స్పామ్ సందేశాల్లోని లింకులను తాకారా.. అంతే సంగతులు. మెయిల్ అకౌంట్లో జంక్ మెయిల్స్ ఎలాగైతే జంకు పుట్టిస్తాయో.. మొబైల్స్‌కు వచ్చే స్పామ్ మెసేజ్‌లు అలానే స్మాష్ చేసేస్తాయి. స్పామ్ సందేశాలకు అడ్డుకట్ట వేసేలా పకడ్బందీ చట్టాలు లేకపోవడం, అదే సమయంలో వాక్ స్వాతంత్య్రానికి ఆటంకాలు కల్పించొద్దన్న వెసులుబాటు స్కామర్లకు పెన్నిధిగా మారింది. దీంతో, నిమిషాల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో మెసేజ్‌లు ఫోన్లకు, మెయిల్ అకౌంట్లకు చేరిపోతున్నాయి. వీటిలో వాణిజ్యపరమైన ప్రచార సందేశాలు కొన్నయితే, స్కామర్లు వలపన్నే మెసేజ్‌లు మరికొన్ని ఉంటాయి. వాణిజ్య ప్రకటనలు వినియోగదారుల సమయాన్ని హరిస్తే.. ఫ్రాడ్స్టర్లు సంధించే సందేశాలు సర్వాన్నీ ఊడ్చేస్తున్నాయి. చేటు చేసే స్పామ్ మెసేజ్‌లలో మాటు వేసే కొన్ని రకాలు ఇవి..
మాల్వేర్: వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేయండి అని ఉంటుంది. క్లిక్ చేశామో.. ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంటుంది.
పిషింగ్: స్పామ్ మెయిల్స్ ద్వారా మీ పాస్వర్డ్, క్రెడిట్ కార్డు నంబర్లు వంటి విలువైన సమచారాన్ని కొల్లగొడతారు.
స్కామ్ సెంట్రల్: కోటి రూపాయలు గెలుచుకున్నారంటూ మెసేజ్ పంపుతారు. దానికి లింక్ జతచేస్తారు. దాని ద్వారా మీ బ్యాంకు వివరాలు నమోదు చేయమని చెబుతారు. అత్యాశకుపోయి వివరాలు పొందుపరిచారో.. మీ డబ్బుల సంగతి మర్చిపోవాల్సిందే!
ప్రొడక్టివిటీ పిట్ఫాల్: గంపగుత్తగా వచ్చిపడే స్పామ్మెయిల్స్తో మెయిల్ అకౌంట్ అంతా చిందరవందరగా తయారవుతుంది. మనకు అవసరమైన మెయిల్ పట్టుకోవడం గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే!
ద బ్యాండ్‌విడ్త్ హాగ్: ఈ స్పామ్ సందేశం ఇ-మెయిల్ అకౌంట్‌ను నెమ్మదింపజేస్తుంది. ఈ మెయిల్‌కు రెస్పాండ్ అయినా, అన్సబ్స్ర్కైబ్ చేసినా.. మీ అకౌంట్ భద్రత గాల్లో దీపంలా తయారవుతుంది.
గుర్తించడం సులభమే
- వ్యక్తిగత సమాచారం ఎవరైనా అడిగారంటే.. ఏదో తేడా ఉందని ఒక అంచనాకు రావాలి. జాగ్రత్తగా పరిశీలిస్తే వెబ్‌లింక్ డొమైన్లో చిన్నపాటి వ్యత్యాసం కనిపిస్తుంది.
- మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘నీడ్ అటెన్షన్’, ‘రిైప్లె’, ‘ఆపర్చునిటీ’, ‘ఇమ్మిడియేట్’, ‘అర్జెంట్’ లాంటి పదాలు ఉన్నాయంటే.. అనుమానించాల్సిందే!
- మెయిల్లో అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు కూడా గమనించవచ్చు.
- కొన్ని స్పామ్ మెయిల్స్ తెలిసిన వ్యక్తి నుంచి వచ్చినట్టే ఉంటాయి. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తే మెయిల్ అడ్రస్‌లో గుర్తించలేని విధంగా ఒక అక్షరాన్ని మారుస్తున్నారు. ఉదాహరణకు ‘m’ బదులుగా ‘rn’ అని ఉంటుంది. తేడా గమనించకుండా స్పందిస్తే స్కామర్ల బారినపడే ప్రమాదం ఉంటుంది.
ఇవి పాటిద్దాం..
ఫోన్‌కు వచ్చే స్పామ్ మెసేజ్‌ల విషయంలో స్పందించకపోవడం మంచిది. స్పామ్ కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయడం ద్వారా వీటి దాడిని కొంత అరికట్టవచ్చు. ఫోన్లోగానీ, కంప్యూటర్లోగానీ ఏదైనా యాప్ గానీ, సాఫ్ట్వేర్ గానీ కావాలనుకుంటే నమ్మదగిన సోర్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. అనుమానాస్పద మెయిల్ అకౌంట్లను అన్సబ్స్ర్కైబ్ చేయండి. మెయిల్స్ విషయానికి వస్తే.. జీ మెయిల్, మైక్రోసాఫ్ట్ ఔట్లుక్, ఆపిల్ మెయిల్లో స్పామ్, జంక్ మెయిల్స్‌ను నిరోధించే అల్గారిథమ్స్ ఉంటాయి. ఇవి స్పామ్ మెయిల్స్‌ను నిరోధిస్తాయి.

ఇలా మార్చుకుందాం
జీ మెయిల్: ప్రైవసీ సెట్టింగ్స్ పక్కాగా మార్చుకోవడం వల్ల కొన్నిటికి అడ్డుకట్ట వేయొచ్చు.
ఆపిల్ మెయిల్: ఆపిల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అందులో సిస్టమ్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయడం ద్వారా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
ఎమ్మెస్ ఔట్లుక్: అకౌంట్ ఐకాన్‌పై క్లిక్ చేసి, అందులో మెనూ లిస్ట్‌లోకి వెళ్లాలి. అక్కడ మై అకౌంట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్ వస్తుంది.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

