ఎదురుకోలు/ఎదురుకోళ్లు
మేడారంలాంటి జాతర్లలో బాగా వినిపించే మాట. ఈ పదబంధం గురించి తెలియని వ్యక్తులు ‘ఎదురుకోలు, ఎదురుకోళ్లు’ను ఒకే అర్థం వచ్చేలా వాడుతున్నారు. ఎదురుకోలు వేరు, ఎదురుకోళ్లు వేరు. ‘ఎదురుకోలు’ అనేది పెండ్లి వంటి శుభకార్యాల్లో
మేడారంలాంటి జాతర్లలో బాగా వినిపించే మాట. ఈ పదబంధం గురించి తెలియని వ్యక్తులు ‘ఎదురుకోలు, ఎదురుకోళ్లు’ను ఒకే అర్థం వచ్చేలా వాడుతున్నారు. ఎదురుకోలు వేరు, ఎదురుకోళ్లు వేరు. ‘ఎదురుకోలు’ అనేది పెండ్లి వంటి శుభకార్యాల్లో అతిథులకు మర్యాద పూర్వక స్వాగతం/ ఆహ్వానం పలకడం. వచ్చినవారిని పరిచయం చేసుకొని, బహుమతులు ఇవ్వడం. ఇక ఎదురుకోళ్లు అంటే వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరలో కనిపించే ఓ ఆచారం. తల్లులు గద్దెలకు చేరుకునే సమయంలో ఈ సంప్రదాయం ప్రకారం నాయక్‌పోడు గిరిజనులు భక్తుల కోరిక మేరకు కోడిని, యాటను ఎగురవేస్తారు. అవి ఎంతెత్తుకు ఎగిరితే అంత అదృష్టమని నమ్మకం. ఈ ఎదురుకోళ్లు ఆచారం ద్వారా గ్రామ దేవతల ఉగ్రత్వాన్ని శాంతింపజేసేందుకు కోళ్లు, పొట్టేళ్లను బలిచేస్తారు.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

