రాకీర కలకంఠ రాజ హంసాది… మునులును గాగ
16వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి పోశెట్టి లింగకవి రచించిన ‘నవచోళ చరిత్ర’ లోనిది ఈ ద్విపద. కుమ్మరి కులానికి చెందిన ఈ బహుజన కవిని పూర్వపు నిజామాబాద్ లేదా వరంగల్ కవిగా పరిశోధకులు భావిస్తున్నారు.
తెలంగాణ ప్రబంధ పరిమళం
శివ కావేరి
శివతరంగముల్ చిందులు వారఁగ –
గట్టినపురిఁ బట్టు గాసెయుఁగాఁగ
ఁస్థిరకరం బగు మేటి తిరుపులు మేనఁ-
బరఁగఁ దాల్చినచక్రఁబటువులు గాఁగ
హర్షంబు దనర మృణాళజాలంబు-
వరుస వీడిన జటాళివలునుఁ గాఁగఁ
బ్రణుతాబ్జ దళము లాభరణముల్ గాఁగ –
ఫణిఫణామణిగణ ప్రభలు గాఁగ
స్ఫుటతర రక్తాబ్జములు నెన్నఁబడిన-
నిటలతటాంబ కోత్కటవహ్ని గాఁగ
వెలిసురుగులను వాఁవిరి నెన్నఁబరఁగు –
పలుచని నెఱపూత భస్మంబు గాఁగ
ప్రస్ఫురన్మృదుజలము ప్రబలి యౌననగ-
సరవిఁ గప్పిన కరిచర్మంబు గాఁగ
రాకీర కలకంఠ రాజహంసాది-
మూఁకలుఁ బూజించు మునులునుఁ గాఁగఁ
విరిదమ్మి కెందమ్మి విరులర్థి నెన్నఁ-
బిరివిఁ బూన్చు ప్రసాద విరులునుఁ గాఁగ
సలలితపద్మరసంబులఁ గ్రోలు-
కలతుమ్మెదలు నీలకంఠముల్ గాఁగఁ
బుద్బుధజాలంబు భువి నెన్న నలిమ-
నద్భుతతస్పటికాక్ష *మాలికల్ గాఁగఁ
నది యొయ్పె శ్రీవిశ్వనాథుండు ననఁగ-
సదమలాత్మకుఁడు భూఁజనవరేణ్యుండు
16వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి పోశెట్టి లింగకవి రచించిన ‘నవచోళ చరిత్ర’ లోనిది ఈ ద్విపద. కుమ్మరి కులానికి చెందిన ఈ బహుజన కవిని పూర్వపు నిజామాబాద్ లేదా వరంగల్ కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఇతని కృతులన్నీ శివభక్తిని, శైవలీలలను ప్రకటించేవే. నిర్మలమైన మనసు కలవాడు, ప్రజలచే శ్రేష్ఠుడిగా ఎంచబడే ఆ కావేరి నది సాక్షాత్తు ఆ శ్రీ విశ్వనాథుడే (శివుడే) అన్నట్లుగా కింది విధంగా ఒప్పుచున్నది.
శివతరంగముల్ చిందులు వారగ… గాసెయు గాగ: కావేరి నదిలో ఉవ్వెత్తున లేస్తూ, చిందులు తొక్కుతున్న శుభప్రదమైన (శివ) తరంగాలు (అలలు)… శివుడి నడుముకు గట్టిగా కట్టిన మొలతాడు (పట్టు కాసె- వస్త్రం) లాగా ప్రకాశిస్తున్నాయి.
స్థిరకరం బగు మేటి తిరుపులు… పటువులు గాగ: నదిలో స్థిరంగా ఏర్పడే పెద్ద పెద్ద సుడిగుండాలు (తిరుపులు)… శివుడి శరీరంపై ఒప్పుచున్న బాహుపురులు (భుజకీర్తులు/ఆభరణాలు) లాగా కనిపిస్తున్నాయి.
హర్షంబు దనర మృణాళజాలంబు… జటాళివలునుఁ గాగ: నదిలో సంతోషాన్ని కలిగిస్తూ వరుసగా విడిపోయి ఉన్న తామరతూడుల (మృణాళ) సమూహాలు… శివుడి తలపైన విడివడి ఉన్న జటల సమూహం లాగా ఉన్నాయి.
ప్రణుతాబ్జ దళము లాభరణముల్ గాగ: పద్మాల రేకులు… శివుడు ధరించిన ఆభరణాలు లాగా భాసిస్తున్నాయి.
ఫణిఫణామణిగణ ప్రభలు గాగ: నదిలో మెరుస్తున్న నీటి కాంతులు లేదా అక్కడక్కడా కనిపించే సర్పాల మణుల కాంతులు… శివుడి మెడలోని పాముల పడగలపై ఉండే మణుల కాంతులు లాగా ఉన్నాయి.
స్ఫుటతర రక్తాబ్జములు… కోత్కటవహ్ని గాగ: నదిలో స్పష్టంగా వికసించి ఉన్న ఎర్రతామరలు (రక్తాబ్జములు)… శివుడి నుదుటిపై (నిటలతట) ప్రకాశించే మూడో కంటి రౌద్రాగ్ని లాగా తోస్తున్నాయి.
వెలిసురుగులను వావిరి… భస్మంబు గాగ: నీటి ప్రవాహంలో పైకి తేలే తెల్లటి నురుగులు… శివుడి శరీరంపై పూసుకున్న తెల్లటి విభూతి (భస్మం) పూతలాగా ఉన్నాయి.
ప్రస్ఫురన్మృదుజలము… కరిచర్మంబు గాగ: నల్లగా, దట్టంగా ప్రవహించే కావేరి నది మృదువైన జలాలు… శివుడి శరీరంపై కప్పుకొన్న గజ చర్మం (ఏనుగు తోలు) లాగా ఒప్పారుతున్నాయి.
రాకీర కలకంఠ రాజ హంసాది… మునులును గాగ: నది ఒడ్డున, నీటిపై గుంపులు గుంపులుగా పూజిస్తున్నట్లు తిరుగుతున్న రామచిలుకలు (కీర), కోయిలలు (కలకంఠ), రాజహంసలు మొదలైన పక్షుల సమూహాలు… శివుణ్ని సేవించే మునుల సమూహంలాగా ఉన్నాయి.
విరిదమ్మి కెందమ్మి విరులర్థి… ప్రసాద విరులును గాగ: నదిలో సమృద్ధిగా పూసిన తెల్లతామరలు, ఎర్రతామరలు… భక్తులకు అనుగ్రహంతో శివుడు ఇచ్చే ప్రసాద పుష్పాల వలె ఉన్నాయి. ఈ విధంగా నదిలోని అలలు, సుడిగుండాలు, తామరతూడులు,
ఎర్రతామరలు, తెల్లటి నురుగులు, పక్షులు, తుమ్మెదలు, నీటి బుడగలు అన్నీ కలిసి కావేరి నదిని ఒక నదిలా కాకుండా, సాక్షాత్తు జటాజూటంతో, విభూతి రేఖలతో, గజ చర్మంతో కొలువై ఉన్న పరమశివుడి స్వరూపంగా కవి ఈ ద్విపదలో అత్యద్భుతంగా వర్ణించారు.
– చేపూరి శ్రీరాం, హన్మకొండ
బుక్ షెల్ఫ్: నా జీవనయానం
రచన: కొణకంచి వేంకట సుబ్రహ్మణ్యం
పేజీలు: 243;
ధర: రూ.250
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 98497 25568
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

