అందాల పోటీల్లో అదరహో అనిపించిన ఈ గుజరాతీ పడుచు.. ఇప్పుడు టాలీవుడ్లో పాగా వేయడానికి విచ్చేసింది.
కామెడీ సినిమాలో యాక్షన్‌తో అదరగొట్టింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మెప్పు పొందిన రియా సింఘా ప్రస్థానం
కొంత చిత్రమే! మొహమాటం తెరల వెనుక ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు కెమెరా ముందుంటేనే తనకు కిక్ అని చెబుతున్నది.
నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అంటున్న రియా పంచుకున్న కబుర్లు ఇవి..
మాడలింగ్ రంగంలో ఉండటంతో యాడ్స్‌లో నటించే అవకాశం దొరికింది. అదే సమయంలో 2023లో ‘మిస్ టీన్ ఎర్త్’ కిరీటం గెలుచుకున్నాను. ఈ ఘనత సాధించిన తొలి గుజరాతీ అమ్మాయిని నేనేనట. అదే ఉత్సాహంతో 2024లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకున్నాను. చి
న్నప్పుడు చాలా మొహమాటంగా ఉండేదాన్ని. నలుగురిలో మాట్లాడాలంటే ఏదో బెరుకుగా ఉండేది. తీరా ఇంటికి వచ్చాక.. అయ్యో నేనెందుకు మాట్లాడలేదు అనుకునేదాన్ని. కాలేజ్ డేస్‌కి వచ్చేసరికి నా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందనుకోండి.పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు లేకుండానే నా బాల్యమంతా సాఫీగా సాగిపోయింది. అమ్మానాన్న ఎంతో గారాబంగా పెంచారు. చదువుల్లో మంచి మార్కులే సాధించేదాన్ని. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మా సొంతూరు.
పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాను.చి
న్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. హిందీ సినిమాలు తెగ చూసేదాన్ని. అలా అనుకోకుండానే నటనపై నాకు ఆసక్తి ఏర్పడింది. అలాగని నటిని కావాలని బలంగా అనుకున్న రోజులు కూడా లేవు. కానీ, స్నేహితుల ప్రోద్బలం, అమ్మానాన్న ప్రోత్సాహంతో మాడలింగ్పై దృష్టి పెట్టాను.
ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ మంచి పట్టే సాధించాను. ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తాను. రెగ్యులర్‌గా వర్కవుట్లు చేస్తుంటాను. ట్రావెలింగ్ అన్నా ఇష్టమే! ముఖ్యంగా ఫ్యామిలీతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. పుస్తకాలు కూడా చదువుతుంటాను. నచ్చిన ఫుడ్ కడుపారా ఆరగిస్తాను.న
టిగా నా ప్రయాణం మొదలైంది ఇప్పుడే! మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఇప్పటికింకా ఫలానా జోనర్లో సినిమాలు చేయాలని ఏదీ అనుకోలేదు. నటిగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ తర్వాతే నా డ్రీమ్ రోల్స్ గురించి ఆలోచిస్తా!
సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. ‘జెట్లీ’ సినిమా దర్శకుడు రితేశ్ రానా నా పాత్ర గురించి చెప్పినప్పుడు కాస్త
ఆలోచించాను. ఎందుకంటే.. నాకు యాక్షన్ అంటే అంతగా ఇష్టం ఉండదు. ఈ సినిమాలో నా రోల్ మొత్తం యాక్షన్
సీక్వెన్స్‌తోనే ఉంటుంది. అందుకే కాస్త తటపటాయించాను. కానీ, రితేశ్ గత సినిమాలు తీసిన విధానం
ఈ పాత్ర ఒప్పుకొనేలా చేసింది. ఇందులో ఏజెంట్ శివానీ రాయ్‌గా స్టంట్స్ బాగానే చేశాను. కెమెరా ముందుకు వచ్చాక
ఏదో ఉత్సాహం కలిగేది. అదే జోష్‌తో సినిమా చేసేశాను.